రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి మహమ్మద్ ఇద్రీష్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసి హత్య చేశారు. వ్యాపార లావాదేవీలే హత్యకు కారణమని.. తెలిసిన వారిపనే అని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మృతుని మెడపై బలమైన గాయాలు ఉన్నాయి. వేరే ప్రాంతంలో హత్యచేసి ఇక్కడ మృతదేహాని వదిలి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి :కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు