ETV Bharat / state

Rangareddy District, Telangana Assembly Elections Result 2023 Live : మెజార్టీకి అడ్డాగా మారిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా - తెలంగాణ అసెంబ్లీ రిజల్ట్స్ 2023

Rangareddy District, Telangana Assembly Elections Result 2023 Live : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా బీఆర్​ఎస్ హవా కొనసాగింది. మెజారిటీ స్థానాల్లో విజయం సాధించింది. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీని కుత్భుల్లాపూర్ నియోజకవర్గం నుంచి బీఆర్​ఎస్​ అభ్యర్థి వివేకానంద్​ గౌడ్​ 85,576 ఓట్ల మెజారిటీతో విజయ దుందుభి మోగించారు. కూకట్‌పల్లిలో మాధవరం కృష్ణారావు 70,237 ఓట్ల మెజార్టీతో మూడో అతిపెద్ద విజయాన్ని నమోదు చేశారు.

Rangareddy District news
Rangareddy District political view
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 3, 2023, 6:35 PM IST

Updated : Dec 3, 2023, 8:26 PM IST

Rangareddy District Telangana Assembly Elections Result 2023 Live : రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్నా... ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మాత్రం బీఆర్​ఎస్ ప్రభంజనం సృష్టించింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఉన్న 14 అసెంబ్లీ స్థానాలకు గానూ 10 స్థానాల్లో విజయ ఢంకా మోగించింది. మిగిలిన నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భారీ మెజారిటీ నమోదయ్యంది. కుత్భుల్లాపూర్​ నియోజకవర్గం నుంచి బీఆర్​ఎస్​ అభ్యర్థి కేపీ వివేకానందగౌడ్ 85వేల 576 ఓట్లతో విజయ దుందుభి మోగించారు. బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్​పై విజయం సాధించారు.

Mallareddy wins Telangana Elections: ఇక మేడ్చల్​- మల్కాజిగిరి జిల్లాలో ఉన్న మొత్తం 5 స్థానాలను బీఆర్​ఎస్​ క్లీన్ స్వీప్ చేసింది. అన్నినియోజకవర్గ స్థానాల్లో విజయం సాధించింది. మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్​ఎస్ అభ్యర్థి చామకూర మల్లారెడ్డి విజయం సాధించారు. 33 వేల 419 మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి వజ్రేష్​ కుమార్​ యాదవ్​, బీజేపీ అభ్యర్థి సుదర్శన్​రెడ్డిపై విజయం ఢంకా మోగించారు.

Madhavaram Krishnarao Wins Telangana Elections : కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి బీఆర్​ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు 70,237 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నుంచి బండి రమేష్, జనసేన నుంచి ప్రేమ్ కుమార్​పై విజయం సాధించారు. మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్​రెడ్డి విజయం సాధించారు. వీరికి ప్రత్యర్థులుగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు, బీజేపీ అభ్యర్థి ఎన్ రాంచందర్​రావుపై గెలుపొందారు.

ఉప్పల్​లో బీఆర్​ఎస్​ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి మందుముల పరమేశ్వర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి ఎన్వీఎస్​ఎస్ ప్రభాకర్​పై గెలుపొందారు.శేరిలింగంపల్లిలో అరికెపూడి గాంధీ విజయం సాధించారు. ఎల్బీనగర్​లో సుధీర్​రెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్​ అభ్యర్థి మధుయాష్కి గౌడ్​పై గెలుపొందారు.

మహేశ్వరంలో బీఆర్​ఎస్​ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి విజయం సాధించారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కిచ్చనగారి లక్ష్మారెడ్డి, బీజేపీ పార్టీ నుంచి అందెల శ్రీరాములు యాదవ్ బరిలో నిలిచారు. రాజేంద్రనగర్‌లో బీఆర్​ఎస్​ అభ్యర్థి ప్రకాశ్‌గౌడ్‌ విజయ ఢంకా మోగించారు. చేవెళ్లలో 283 ఓట్ల స్వల్ప మెజారిటీతో బీఆర్​ఎస్ అభ్యర్థి కాలే యాదయ్య గెలుపొందారు. స్వల్ప ఓట్ల తేడా రావడంతో కాంగ్రెస్ అభ్యర్థి భీమ్ భరత్ రీకౌంటింగ్ అడిగారు. కాంగ్రెస్ డిమాండ్​తో అధికారులు రీకౌంటింగ్ చేశారు. ఐదు వీవీప్యాట్​లను లెక్కించిన అనంతరం కాలే యాదయ్య గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

Malreddy Rangareddy wins Ibrahimpatnam Constituency : మిగిలిన నాలుగు నియోజకవర్గాలను కాంగ్రెస్ అభ్యర్థులు హస్తగతం చేసుకున్నారు. వికారాబాద్‌లో ప్రసాద్‌కుమార్‌, తాండూర్‌లో మనోహర్‌రెడ్డి, ఇబ్రహీంపట్నంలో మల్​రెడ్డి రంగారెడ్డి విజయం సాధించారు. పరిగి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి గెలుపొందారు.

Last Updated : Dec 3, 2023, 8:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.