రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో రోడ్డు ప్రమాదం సంభవించింది. కొత్వాల్ గుడ బాహ్యవలయ రహదారిపై రెండు కార్లు ఢీకొన్నాయి. ఒక కారు నిజాంపేట్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వస్తుండగా... మరో కారు ఎయిర్‌పోర్ట్ వైపు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా కారు ఒక్కసారిగా అదుపు తప్పి డివైడర్ దాటి ఇవతలకు వచ్చి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో సునిత, సౌజన్య, రమ్య, జ్యోతి, సురేష్‌తో పాటు మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. మొత్తం ఎనిమిది మందికి తీవ్రగాయాలు కాగా... ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి అతివేగమే కారణంగా భావిస్తున్నారు.
ఔటర్‌పై రెండు కార్లు ఢీ... 8 మందికి గాయాలు - ఔటర్‌పై రెండు కార్లు ఢీ... ఎనిమిది మందికి గాయాలు
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఔటర్ రింగ్‌రోడ్డు మీద ప్రమాదం జరిగింది. వేగంగా ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎనిమిది మందికి తీవ్రగాయాలు కాగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.