హైకోర్టు న్యాయవాద దంపతుల హత్యను నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టులో విధులను బహిష్కరించిన లాయర్లు ఆందోళనకు దిగారు. కోర్టు ఆవరణ నుంచి న్యాయవాదులు నినాదాలు చేస్తూ రోడ్డుపైకి చేరుకున్నారు. న్యాయవాదులకు రక్షణ చట్టాలు తేవాలని డిమాండ్ చేస్తూ విజయవాడ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో పెద్దఎత్తున ట్రాఫిక్ జాం అయింది.
ఇదీ చూడండి : న్యాయవాద దంపతుల హత్య కేసులో బిట్టు శ్రీను అరెస్టు