ETV Bharat / state

రామానుజాచార్యులు అసమానత్వపు గోడలు కూల్చారు: రాజ్​నాథ్​ సింగ్

Ramanuja Sahasrabdi Utsav: రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్​ సమీపంలోని శ్రీరామనగరం సమతామూర్తి కేంద్రం జనసంద్రమైంది. రామానుజాచార్యుల విగ్రహం లోకార్పితం కావడంతో ముచ్చింతల్‌లోని దివ్యక్షేత్రాన్ని సందర్శించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది నుంచి భక్తులు, సందర్శకులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఫలితంగా శ్రీరామనగరం జాతరను తలపిస్తోంది.

RAMANUJA SAHASRABDI UTSAV HAVE BEEN CONTINUES IN MUCHINTAL
వైభవంగా సహస్రాబ్ది ఉత్సవాలు
author img

By

Published : Feb 10, 2022, 4:06 PM IST

Updated : Feb 10, 2022, 10:10 PM IST

Ramanuja Sahasrabdi Utsav:

రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో శ్రీరామానుజాచార్య సహస్రాబ్ది సమారోహ వేడుకలు తొమ్మిదో రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవ మూర్తులతో ప్రధాన యాగశాల నుంచి సమతాస్ఫూర్తి కేంద్రం వరకు రుత్విజుల శోభాయాత్ర కొనసాగింది. శోభాయాత్ర తర్వాత దివ్యక్షేత్రాల్లోని 20 ఆలయాల్లోని విగ్రహాలకు చిన్నజీయర్‌ స్వామి, వేద పండితులు ప్రాణప్రతిష్ఠ చేశారు. ఇప్పటికే శ్రీరామనగరంలోని 32 ఆలయాల్లో ప్రాణప్రతిష్ఠ పూర్తయింది.

సమతా మూర్తి కేంద్రాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌....సెల్ఫ్‌ గైడెడ్‌ టూర్‌ ద్వారా శ్రీరామనగరం విశేషాలను తెలుసుకున్నారు. 108 దివ్యదేశాలను దర్శించుకున్నారు. సమతామూర్తి ప్రాంగణంలో మొక్కను నాటిన రాజ్ నాథ్ సింగ్... లక్ష్మీనారాయణ క్రతువులో పాల్గొన్నారు. రాజ్‌నాథ్‌ వెంట కేంద్ర మాజీమంత్రి రవిశంకర్ ప్రసాద్, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ ఉన్నారు. సమతామూర్తి కేంద్రానికి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్ చేరుకుని.. దర్శించుకున్నారు.

మరోవైపు యతి రామానుజాచార్యుల జయజయ ధ్వానాలతో ముచ్చింతల్‌ మార్మోగుతోంది. వేద పారాయణం.. అష్టాక్షరీ మహా మంత్ర జపం.. విష్ణు సహస్ర నామ పారాయణల్లో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొని భగవన్నామస్మరణలో మునిగిపోతున్నారు. శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహంలో నగరం నుంచి పెద్దఎత్తున భక్తులు విచ్చేసి సమతామూర్తిని దర్శించుకుంటున్నారు. ప్రధాన యాగశాలలో పెరుమాళ్‌ స్వామికి పెద్దఎత్తున పూజలు చేస్తున్నారు.

ఆది శంకరచార్యులు సనాతన ధర్మం కోసం కృషి చేశారు. రామానుజాచార్యులు, శంకరాచార్యులు, మద్వచార్యులు హిందూ సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లారు. అంటరానితనంపై రామానుజాచార్యులు గళమెత్తారు. లింకన్ వంటి వారు కూడా సమానత్వం కోసం కృషి చేశారు. సమాజంలో అందరూ సమానమే అని చిన్నజీయర్ స్వామి చాటుతున్నారు. రామానుజాచార్యులు అసమానత్వపు గోడలు కూల్చారు. వెనుకబడినవారిని పూజరులుగా చేశారు. 216 అడుగుల ప్రతిమ రామానుజాచార్యుల మరో అవతారంగా భావిస్తున్నాం.

- రాజ్​నాథ్ సింగ్, రక్షణ మంత్రి

ఈరోజు కార్యక్రమాలు

ఉదయం 6.30కు అష్టాక్షరీ మహామంత్ర జపం. మధ్యాహ్నం పూర్ణాహుతి పూర్తైంది. ప్రవచన మండపంలో ఉదయం 9.30 గంటల నుంచి శ్రీరామానుజ అష్టోత్తర శతనామపూజ నిర్వహించారు. సాయంత్రం 5.30 గంటలకు హోమం ప్రారంభమై.. రాత్రి 9.30 గంటలకు ముగియనుంది. అకాల వృష్టి నివారణ, సస్యవృద్ధికి వైయ్యూహికేష్టి, దుష్టగ్రహ బాధ నివారణకు శ్రీనారసింహేష్టి నిర్వహిస్తారు. 20 దివ్య దేశాలలో దేవతామూర్తుల ప్రాణప్రతిష్ఠ చేశారు.

14న స్వర్ణమూర్తి ప్రాణప్రతిష్ఠ

ఈ నెల 13న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 120 కిలోల స్వర్ణమూర్తిని ఆవిష్కరించి లోకార్పణం చేస్తారని చిన జీయర్‌ స్వామి తెలిపారు. 14న విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరుగుతుందన్నారు.

ఇదీ చూడండి: Ramanuja Sahasrabdi Utsav: శోభాయమానంగా రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు

Last Updated : Feb 10, 2022, 10:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.