రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ ప్రాంతంలో తనిఖీ కేంద్రాన్నిరాజేంద్రనగర్ ఏసీపీ సంజయ్ కుమార్ పరిశీలించారు. వాహనాలను స్వయంగా తానే ఆపి అనుమతి లేకుండా బయటికి వచ్చిన వాహనదారులపై కేసులు నమోదు చేశారు.
ప్రజల సహకారం, వివిధ శాఖల సమన్వయంతో లాక్డౌన్ పకడ్బందీగా అమలవుతుందని ఆయన అన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజలందరూ తప్పకుండా ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని ఏసీపీ కోరారు.
కరోనా వైరస్ కట్టడి కోసం ప్రతీ ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర పనులకు మాత్రమే ఇంటి నుంచి బయటకు రావాలని తెలిపారు.
ఇదీ చూడండి: INTER EXAMS: జులైలో సీనియర్ ఇంటర్ పరీక్షలు!