ETV Bharat / state

దాతల సాయంతో వలస కూలీలకు వసతి గృహాలు: సీపీ మహేశ్​ భగవత్​ - వలస కూలీలు

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా దాతల సాయంతో వసతి గృహాలు ఏర్పాటు చేయడం జరిగిందని సీపీ మహేశ్​ భగవత్​ వెల్లడించారు. ఎక్కడి వారు అక్కడే ఉండాలని ఊళ్లకు వెళ్లాలనే నిర్ణయాన్ని విరమించుకుని లాక్​డౌన్​కు సహకరించాలని కోరారు.

rachakonda cp mahesh bhagavath addressed to migrant workers from other states of Hyderabad
దాతల సాయంతో వలస కూలీలకు వసతి గృహాలు: సీపీ మహేశ్​ భగవత్​
author img

By

Published : Mar 28, 2020, 3:12 PM IST

కరోనా వైరస్​ కట్టడి చర్యల్లో భాగంగా రాచకొండ కమిషనరేట్​ పరిధిలో ఉన్న వలస కూలీలకు దాతల సాయంతో భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తామని సీపీ మహేశ్​ భగవత్​ వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్​లోని కమిషనరేట్​ క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇటుకల బట్టీలు, మార్బుల్స్​, భవన నిర్మాణాల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్న కార్మికులు లాక్​డౌన్​ నేపథ్యంలో తమ ఇళ్లకు వెళ్లాలన్న నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరారు. వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వసతి గృహాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని సీపీ తెలిపారు.

దాతల సాయంతో వలస కూలీలకు వసతి గృహాలు: సీపీ మహేశ్​ భగవత్​

బీహార్,​ ఒరిస్సా, పశ్చిమ బెంగాల్​ నుంచి వచ్చి హైదరాబాద్​లో​ కూలీ పనులు చేసుకుంటున్న వారు ఎక్కడికీ వెళ్లొద్దని ఎక్కడి వారు అక్కడే ఉండాలని ఆయన సూచించారు. పశ్చిమబెంగాల్​కు సంబంధించిన 200 మంది వలస కూలీలకు బాలాపూర్​ తదితర ప్రాంతాల్లో వసతి గృహాలు ఏర్పాటు చేశామని తెలిపారు. క్వారంటైన్​లో ఉన్న వారు 21 రోజులు బయటికి వెళ్లకుండా ఉండాలని నిబంధనలు ఉల్లంఘించి బయట తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని మహేశ్​ భగవత్​ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: విస్తరిస్తున్న కరోనా... ఒక్కరోజే 14 మందికి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.