ETV Bharat / state

జీహెచ్ఎంసీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: రాచకొండ సీపీ - ఎన్నికల ఏర్పాట్లపై సీపీ మహేశ్ భగవత్ మీడియా సమావేశం

రాచకొండ పోలీస్​ కమిషనరేట్ పరిధిలో జరిగే జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ స్పష్టం చేశారు. 12 పోలింగ్ కేంద్రాలను అత్యంత సున్నితమైనవిగా గుర్తించినట్లు సీపీ తెలిపారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: రాచకొండ సీపీ

author img

By

Published : Nov 21, 2020, 5:41 PM IST

రాచకొండ పోలీస్​ కమిషనరేట్ పరిధిలో జరిగే జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం సూచించిన మేరకు పటిష్ట బందోబస్తు కల్పిస్తున్నామని సీపీ పేర్కొన్నారు. రాచకొండ పరిధిలోకి వచ్చే ఎల్బీనగర్‌ జోన్‌లో 13, మల్కాజిగిరి జోన్‌లో 17 వార్డులు ఉన్నాయని సీపీ వివరించారు. అత్యంత సున్నితమైన 12 కేంద్రాలు పోలీస్​స్టేషన్ల పరిధిలో ఉన్నట్లు గుర్తించామని తెలిపారు.

మొదటిసారిగా అన్ని పోలీస్​స్టేషన్‌లకు జియో ట్యాగింగ్, స్పెషల్‌ బ్రాంచ్‌లో ఎలక్షన్‌ సెల్​ను ఏర్పాటు చేశామని... దీనిని నోడల్ ఆఫీసర్ పర్యవేక్షిస్తారని సీపీ వివరించారు. ప్రింటింగ్ ప్రెస్​కు బందోబస్తు కల్పించినట్లు పేర్కొన్నారు. పోలింగ్ లొకేషన్‌లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపునకు మూడంచెల భద్రత ఉంటుందన్నారు. సమస్యాత్మక పోలీస్ స్టేషన్‌‌లలో ముందుస్తు చర్యల్లో భాగంగా రౌడీషీటర్ల బైండోవర్ కొనసాగుతుందన్నారు. రోడ్‌ షోలకు అనుమతి తప్పకుండా తీసుకోవాలని సీపీ సూచించారు.

ఇదీ చూడండి:తెరాస కార్పొరేటర్లు బాగా పనిచేస్తే.. కొత్తవారికి టికెట్ ఎందుకిచ్చారు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.