ETV Bharat / state

'మమ్మల్ని మురుగునీటి బారి నుంచి రక్షించండి' - పెద్ద అంబర్​పేట్ మున్సిపాలిటీ పరిధిలోని కల్వంచ, శాంతి నగర్ కాలనీవాసులు ధర్నా

పెద్ద అంబర్​పేట్ మున్సిపాలిటీ పరిధిలోని కల్వంచ, శాంతి నగర్ కాలనీవాసులు ధర్నాకు దిగారు. ఇటీవల కురిసిన వర్షాలకు కాలనీల్లో భారీగా డ్రైనేజీ నీరు చేరిందని.. వనస్థలిపురం కాలనీల నుంచి వస్తున్న డ్రైనేజి నీరు, వర్షపు నీరు తమ కాలనీల మీదుగానే వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమను మురుగునీటి సమస్య నుంచి రక్షించాలని మొరపెట్టుకున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని వాపోయారు.

protest to protect from drainage water by shantinagar colny people
'మమ్మల్ని మురుగునీటి బారి నుంచి రక్షించండి'
author img

By

Published : Oct 1, 2020, 9:11 PM IST

రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్​పేట్ మున్సిపాలిటీ పరిధిలోని కల్వంచ, శాంతి నగర్ కాలనీవాసులు ఆందోళన చేపట్టారు. ఇటీవల కురిసిన వర్షాలకు భారీగా వరద నీరు, డ్రైనేజీ నీరు చేరిందని.. రోడ్లన్నీ జలమయమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లలోకి వెళ్లాలన్నా, బయటకు రావాలన్నా మురుగు నీళ్లలో నుంచి రావాల్సి వస్తుందని కాలనీవాసులు వాపోయారు. ఎన్నోసార్లు ప్రజాప్రతినిధులకు, అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకపోయిందని.. కాలనీ వాసులంతా తమ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ఆందోళనకు దిగారు.

స్థానికులంతా నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శించారు. తమను మురుగునీటి బారి నుంచి రక్షించాలని కోరారు. వనస్థలిపురం కాలనీల నుంచి వస్తున్న డ్రైనేజి నీరు, వర్షపు నీరు కలసి తమ కాలనీల మీదుగానే వస్తున్నాయన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రత్యేకమైన ట్రంక్ లైన్​తో పైనుంచి వచ్చే డ్రైనేజ్ వాటర్​ను కుమ్మరి కుంటలో కలపాలని స్థానికులు కోరారు.

'మమ్మల్ని మురుగునీటి బారి నుంచి రక్షించండి'

ఇదీ చూడండి:కొవిడ్‌పై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలి: రాజీవ్‌ గౌబా

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.