Private School Staff visited Ramoji FilmCity : పిల్లలు, పాఠాలు, పరీక్షలతో తీరిక లేకుండా గడిపే ఉపాధ్యాయులకు రామోజీ ఫిల్మ్‌సిటీ సందర్శన గొప్ప అనుభూతిని పంచింది. హైదరాబాద్‌లోని దిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి ఇంటర్నేషనల్ స్కూళ్లకు చెందిన ఉపాధ్యాయులు, సిబ్బంది.. ఫిల్మ్‌సిటీని (Ramoji FilmCity) సందర్శించి సరికొత్త ఆనుభూతిని పొందారు.సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం రోజే రావాల్సి ఉన్నా.. వాతావరణ పరిస్థితుల వల్ల ఆలస్యంగా వచ్చామన్న వారు.. ఫిల్మ్‌సిటీ అందాల్ని చూసి ముగ్ధులయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సాహాలతో గడిపారు.
Ramoji Filmcity: ఈట్ రైట్ క్యాంపస్‌గా రామోజీ ఫిల్మ్‌సిటీ
"2000 మంది ఉపాధ్యాయులు, 500 మంది సిబ్బంది కలిసి ఉపాధ్యాయ దినోత్సవాన్ని రామోజీ ఫిల్మ్‌సిటీలో ఘనంగా నిర్వహించుకున్నాం. రామోజీ ఫిల్మ్‌సిటీ దేశంలోనే కాక.. ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచింది. ఫిల్మ్‌సిటీ అందాలు మమ్మల్ని కట్టిపడేశాయి." - కొమరయ్య, ఛైర్మన్ డీపీఎస్, పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్స్
రామోజీ ఫిల్మ్‌సిటీలోకి అడుగు పెట్టిన వెంటనే స్వాగత వేడుక వారిని కట్టిపడేసింది. యూరేకాలోని యుద్ధ సన్నివేశాలు ఉర్రూతలూగించాయి. బాహుబలి సెట్, బర్డ్ పార్క్, సీతాకోక చిలుకల పార్క్‌తో పాటు వివిధ ప్రాంతాలు మంత్రముగ్ధుల్ని చేశాయన్నారు. సహచరులతో కలిసి ఫిల్మ్‌సిటీ సందర్శన సరికొత్త ఆనందాన్ని పంచిందని పేర్కొన్నారు. జీవితంలో మధుర జ్ఞాపకంగా నిలిచే రామోజీ ఫిల్మ్‌సిటీ సందర్శనకు కుటుంబంతో కలిసి మళ్లీ వస్తామంటూ తెలిపారు.
రామోజీకి NTR సెంటినరీ అవార్డు.. ఉత్తమ ఛానల్‌గా ఈటీవీ.. అట్టహాసంగా ఫాస్ సినీ అవార్డుల ప్రదానం
"2000 మందికి పైగా ఇక్కడికి వచ్చాం. రామోజీ ఫిల్మ్‌సిటీ అందాలు మమల్ని కట్టిపడేశాయి. రామోజీ ఫిల్మ్‌సిటీ చాలా బాగుంది. యూరేకాలోని యుద్ధ సన్నివేశాలు, బాహుబలి సెట్, బర్డ్ పార్క్, సీతాకోక చిలుకల పార్క్‌తో పాటు వివిధ ప్రాంతాలు చాలా బాగున్నాయి. సినిమా షూటింగ్ ఎలా తీస్తారో తెలుసుకున్నాం. ఫిల్మ్ దునియా, రెటిరో కూడా చాలా బాగుంది. ఇదంతా చూసి మమల్ని మేము మరిచిపోయాం." - ఉపాధ్యాయులు
ICC Cricket World Cup 2023 Trophy at Ramoji Film City : ఇటీవలే ప్రపంచకప్ క్రికెట్ ట్రోఫీ టూర్‌లో భాగంగా.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామోజీ ఫిల్మ్‌సిటీ వేదికైంది. ఈ ట్రోఫీని రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి, ప్రియా ఫుడ్స్ డైరెక్టర్ సహరి ఆవిష్కరించారు. వరల్డ్ కప్ ట్రోఫీని ఫిల్మ్ సిటీలో ఆవిష్కరించి క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించారు. క్రికెట్ వరల్డ్‌కప్ ట్రోఫీ (ICC Cricket World Cup 2023 Trophy) టూర్‌లో భాగంగా రామోజీ ఫిల్మ్‌సిటీలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి.. ఈనాడు ఎండీ కిరణ్, ఈనాడు డైరెక్టర్ ఐ.వెంకట్, ఈటీవీ సీఈఓ బాపినీడు, రామోజీ గ్రూప్ సంస్థల ప్రెసిడెంట్ హెచ్‌ఆర్ గోపాల్‌రావుతోపాటు సంస్థల పలు విభాగాధిపతులు, సిబ్బంది హాజరయ్యారు. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగబోతున్న ఈ ప్రపంచకప్‌లో.. మొత్తం 10 దేశాలు పాల్గొనబోతున్నాయి. ఈ సందర్భంగా రామోజీ ఫిల్మ్‌సిటీలో ఒరిజినల్ ట్రోఫిని ప్రదర్శించారు.