ETV Bharat / state

ఓపెన్‌ చేసి ఉన్న పోస్టల్‌ బ్యాలెట్‌ బాక్సులు - ఆందోళనలో కాంగ్రెస్‌ నేతలు - పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు బాక్సులు

Postal Ballot Boxes Open in Ibrahimpatnam Constituency : పోస్టల్‌ బ్యాలెట్‌ బాక్సులు తెరచి ఉండడం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కలకలం రేగింది. స్ట్రాంగ్‌ రూమ్‌లో ఉండాల్సిన బాక్సులు ఆర్డీవో కార్యాలయంలో ఉండడంపై కాంగ్రెస్‌ శ్రేణులు ఆందోళన చెందారు. కాసేపు పోలీసులు, కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం అక్కడి నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌ బాక్సులను స్ట్రాంగ్‌రూంకు తీసుకెళ్లారు.

Postal Ballot Boxes Open in Ibrahimpatnam
Postal Ballot Boxes Open in Ibrahimpatnam Constituency
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 2, 2023, 10:03 PM IST

Updated : Dec 2, 2023, 10:41 PM IST

Postal Ballot Boxes Open in Ibrahimpatnam Constituency : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పోస్టల్‌ బ్యాలెట్‌ బాక్సుల తెరిచి ఉండడం కలకలం సృష్టించాయి. స్ట్రాంగ్‌రూమ్‌లో ఉండాల్సిన పోస్టల్‌ బ్యాలెట్‌(Postal Ballot) బాక్సులు ఆర్డీవో కార్యాలయంలో ప్రత్యక్షమయ్యాయి. ఈ నెల 29 నాటి పోస్టల్‌ బ్యాలెట్లను స్ట్రాంగ్‌ రూమ్‌కు అధికారులు పంపించలేదు.

ఈ విషయం తెలియడంతో ఆర్డీవో కార్యాలయానికి కాంగ్రెస్‌ శ్రేణులు భారీగా చేరుకున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ బాక్సులు తెరిచి ఉండటంపై ఆర్డీవో కార్యాలయం వద్ద కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు. పోస్టల్‌ బ్యాలెట్‌ సీల్‌ తొలగించి ఉండటంపై కాంగ్రెస్‌, స్వతంత్ర అభ్యర్థుల ఏజెంట్లు ఆందోళనకు చెందారు.

ఎలక్షన్ కౌంటింగ్ కేంద్రంలోకి ఎప్పుడైనా వెళ్లారా? లోపల ఏం జరుగుతుందో తెలుసా?

Ibrahimpatnam Constituency Election Result 2023 : కాంగ్రెస్‌ శ్రేణుల ఆందోళనతో పోస్టల్‌ బ్యాలెట్లను స్ట్రాంగ్‌ రూమ్‌కు అధికారులు తరలించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ తరలించిన తర్వాత అధికారులు దానికి సీల్‌ వేశారు. రెండు రోజులుగా స్ట్రాంగ్‌ రూమ్‌కు తాళం లేకపోవడంతో కాంగ్రెస్‌ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఆర్డీవో కార్యాలయం వద్ద పోలీసులకు, కాంగ్రెస్‌ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది.

ఈక్రమంలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో(RDO)ను కాంగ్రెస్‌ శ్రేణులు, కార్యకర్తలు నిలదీశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 3057 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు అయ్యాయి. ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయానికి ఎన్నికల అబ్జర్వర్‌, కలెక్టర్‌ భారతి హోలీకేరి చేరుకున్నారు. అక్కడ ఆందోళన చేస్తున్న కాంగ్రెస్‌, స్వతంత్ర పార్టీల కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. వారు ఆ పోస్టల్‌ బ్యాలెట్‌ బాక్స్‌లను పరిశీలిస్తున్నారు. ఇంకా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

28,057 పోస్టల్‌ బ్యాలెట్‌ అఫ్లికేషన్లు ఆమోదం

రేపే జడ్జిమెంట్ డే- ఎలక్షన్ కౌంటింగ్​కు ఈసీ ఏర్పాట్లు పూర్తి

Last Updated : Dec 2, 2023, 10:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.