రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు చేపట్టింది. దశలవారీగా నేతలు, కార్యకర్తలు, శ్రేణులు కలెక్టరేట్ ముట్టడికి యత్నించగా... ఉద్రిక్తత నెలకొంది. కార్యాలయం లోపలకు వెళ్లి పాలనాధికారికి వినతిపత్రం అందించేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ పార్టీ నేత పొన్నల లక్ష్మయ్య, మల్రెడ్డి రంగారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చల్లా నరసింహరెడ్డి, ఇతర నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. కేసీఆర్ ఫాంహౌజ్లో పడుకుని ప్రధాని అవ్వాలనే కలలు కంటున్నారని పొన్నాల ఎద్దేవా చేశారు.
ఇంటర్ వివాదం: కాంగ్రెస్ నేతలు అరెస్ట్ - ఇంటర్ వివాదం: పొన్నాల అరెస్ట్
Summary: ఇంటర్ బోర్డు నిర్వాకాన్ని నిరసిస్తూ రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాకు కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహించింది. పొన్నాల లక్ష్మయ్య, మల్రెడ్డిరంగారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చల్లా నరసింహరెడ్డి, ఇతర నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసీఆర్ ప్రజల గొంతుని నొక్కుతున్నారని పొన్నాల ఆరోపించారు.