ఎవరిదైనా ప్రోద్బలముందా...?
మరోవైపు ఘటనలో తీవ్ర గాయాలపాలై ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడు సురేశ్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దాడికి సంబంధించి సురేశ్ వెనుక ఎవరి ప్రమేయం, ప్రోద్బలం ఉందనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనలో గాయపడిన అటెండర్ చంద్రయ్య, రైతుకు అపోలో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
తహసీల్దార్ హత్యతో శివారు ప్రాంతాల్లో భూవివాదాలు ఒక్కొటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ హత్యతో స్థానిక అధికార ప్రతిపక్ష నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.
ఇదీ చూడండి: వాయుకాలుష్యం ధాటికి మాస్కులు ధరిస్తున్న దేవుళ్లు