కానిస్టేబుల్స్ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆడిటోరియంలో అభినందన సభ నిర్వహించారు. ఉద్యోగాలు పొందిన వారిని కమిషనర్ సజ్జనార్ సన్మానించారు.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి కలెక్టర్ హరీశ్, శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి, ఏజీ కాలేజి వైస్ ఛాన్స్లర్ ప్రవీణ్ రావు తదితరులు పాల్గొన్నారు. శివరంపల్లికి చెందిన రేణుక అనే మహిళ ముగ్గురు కుమార్తెలకు ఉద్యోగం రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రేణుకను సీపీ ప్రత్యేకంగా సన్మానించారు.
ఇదీ చూడండి: 'సమ్మె విరమించేది లేదు.. చర్చలకు సిద్ధమే'