ETV Bharat / state

'అభద్రతా భావాన్ని తొలగించేందుకే కార్డెన్ సెర్చ్' - Police conduct cordon search in Mylar Dev Palli

రంగారెడ్డి జిల్లా మైలర్ దేవ్​పల్లిలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని పలు వాహనాలును స్వాధీనం చేసుకున్నారు. ప్రజల్లో ఉన్న అభద్రతా భావాన్ని తొలగించేందుకే కార్డెన్ సెర్చ్ చేపట్టామని శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకాశ్​ రెడ్డి తెలిపారు.

Police conducted custody checks at Mylar Dev Palli in Rangareddy district.
'అభద్రతా భావాన్ని తొలగించేందుకే కార్డెన్ సెర్చ్'
author img

By

Published : Mar 21, 2021, 5:06 AM IST

రంగారెడ్డి జిల్లా మైలర్ దేవ్​పల్లిలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకాశ్​ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 163 మంది పోలీసులు తనిఖీల్లో పాల్గొని.. సరైన అనుమతి పత్రాలు లేని 36 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు,1 కారును స్వాధీనం చేసుకున్నారు. 20 మంది రౌడీషీటర్ల ఇంటికి వెళ్లి వారి వివరాలను సేకరించారు.

ప్రజలలో ఉన్న అభద్రతా భావాన్ని తొలగించి... భద్రతా భావాన్ని పెంపొందించేందుకే ఈ కార్డెన్ సర్చ్ నిర్వహించామని డీసీపీ ప్రకాశ్​ రెడ్డి తెలిపారు. లాక్ డౌన్ కారణంగా కార్డెన్ సర్చ్​ను ఆపివేయటం జరిగిందని తెలిపారు. ఇకనుంచి నిరంతరం శంషాబాద్ జోన్​లో గల పలు పోలీస్ స్టేషన్ల పరిధుల్లో నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు.

ఇదీ చదవండి: స్విమ్మింగ్​పూల్​లో మునిగి బాలుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.