Bandi Sanjay Arrest: అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ నుంచి బండి సంజయ్‌ని భాజపా రాష్ట్ర కార్యాలయానికి తరలించారు. బండి సంజయ్ అరెస్టును నిరసిస్తూ భాజపా శ్రేణులు స్టేషన్‌కు భారీగా చేరుకున్నారు. ఆయణ్ని వెంటనే విడుదల చేయాలని వారు జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఆందోళనకు దిగిన కాషాయ శ్రేణులను పోలీసులు చెదరగొట్టారు. అనంతరం బండి సంజయ్‌ను ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తరలించారు.
అసలేెం జరిగిదంటే: మునుగోడులోనే మంత్రులు, తెరాస ఎమ్మెల్యేలు ఉన్నా.. ఎన్నికల కమిషన్ పట్టించుకోవడం లేదంటూ బండి సంజయ్ బుధవారం అర్ధరాత్రి దాటాక హైదరాబాద్ నుంచి ఆ నియోజకవర్గానికి బయల్దేరగా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పలుచోట్ల అడ్డుకొన్నారు. చివరకు ఆయనను అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు .అబ్దుల్లాపూర్‌మెట్ పీఎస్‌లో బండి సంజయ్‌ని నిర్బంధించారు. బండి సంజయ్ వెంట వీరేందర్ గౌడ్, ఎన్.వి సుభాష్, సంగప్ప ఉన్నారు. అంతకుముందు పోలీసులు, భాజపా కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.
తొలుత మలక్‌పేట వద్ద అడ్డుకున్నా సంజయ్ ముందుకెళ్లారు. మరోమారు వనస్థలిపురం వద్ద పోలీసులు నిలువరించారు. కార్యకర్తల సహకారంతో కాన్వాయ్ ముందుకు సాగింది. అనంతరం అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద జాతీయ రహదారిపై తమ వాహనాలుంచి పోలీసులు ఆపారు. దీంతో భాజపా కార్యకర్తలు ధర్నా చేశారు. దీంతో ఇరువైపు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు భారీగా నిలిచిపోయాయి.
ఇవీ చదవండి: రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ప్రభుత్వం దిగొచ్చింది: బండి సంజయ్
వంతెన మరమ్మతు పనుల్లో జాప్యం.. రాత్రంతా నది ఒడ్డునే నిద్రించిన మంత్రి