pm modi reached to muchintal: సమతా సూత్రాన్ని లోకానికి అందించిన మహానుభావుడు రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహంలో కీలకఘట్టం ఆవిష్కృతం కానుంది. ముచ్చింతల్‌లో నిర్మించిన 216 అడుగుల ఎత్తయిన రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని మోదీ వసంత పంచమి పర్వదినం సందర్భంగా ఆవిష్కరించి జాతికి అంకితం ఇవ్వనున్నారు. పంచలోహాలతో రూపొంది, కూర్చున్న మూర్తుల్లో ప్రపంచంలోనే ఇది రెండో అతి పెద్ద విగ్రహంగా గుర్తింపు పొందింది.
ఇప్పటికే పటాన్‌చెరులోని ఇక్రిశాట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సాయంత్రం 5గంటలకు ప్రధాని ముచ్చింతల్‌కు చేరుకున్నారు. మోదీకి గవర్నర్ , చిన్నజీయర్ స్వామి, జూపల్లి రామేశ్వరరావు స్వాగతం పలికారు. దాదాపు 3 గంటలపాటు సమతామూర్తి కేంద్రంలోనే మోదీ పర్యటించనున్నారు. సంప్రదాయ వస్త్రాల్లో 5.42గంటలకు యాగశాలకు చేరుకున్న ప్రధాని... ప్రధాన యాగశాలలో విష్వక్సేనేష్ఠి యాగంలో పాల్గొని విశ్వక్సేనుడికి పూజ చేశారు. ఈ పూజలో ప్రధానితో పాటు గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూర్చున్నారు. 108 వైష్ణవ ఆలయాలను ప్రధాని సందర్శించనున్నారు. కాసేపట్లో 216 అడుగులతో కొలువుదీరిన సమతామూర్తి విగ్రహానికి చిన్నజీయర్ స్వామి సమక్షంలో పూజలు నిర్వహించి ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు.
ఇవీ చదవండి: Statue Of Equality: కళ్లు చెదిరే నిర్మాణ చాతుర్యం.. కనీవినీ ఎరుగని ఆధ్యాత్మిక కార్యక్రమం