ETV Bharat / state

ఎమ్మెల్సీ అభ్యర్థిగా పట్నం మహేందర్ ​రెడ్డి నామినేషన్​ - trs mlc

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లా తెరాస అభ్యర్థిగా మాజీ మంత్రి పట్నం మహేందర్​రెడ్డి నామపత్రాలు దాఖలు చేశారు.

ఎమ్మెల్సీ అభ్యర్థిగా పట్నం మహేందర్ ​రెడ్డి నామినేషన్​
author img

By

Published : May 14, 2019, 2:16 PM IST

ఎమ్మెల్సీ అభ్యర్థిగా పట్నం మహేందర్ ​రెడ్డి నామినేషన్​

రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెరాస నుంచి మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి నామినేషన్‌ వేశారు. మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మల్లారెడ్డి వెంట రాగా... రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో పాలనాధికారికి నామపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నేతలు తరలివచ్చారు.

ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా

ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనకు అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మహేందర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకనుగుణంగా చిత్తశుద్ధితో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి : బ్యాలెట్ పత్రాల తారుమారు... రీపోలింగ్ నిర్వహించాలని నిరసన

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.