ETV Bharat / state

కొవిడ్‌తో తల్లిదండ్రులు.. గుండెపోటుతో కుమారుడు

author img

By

Published : May 6, 2021, 9:29 AM IST

Updated : May 6, 2021, 10:45 AM IST

కరోనా బారిన పడిన కొడుకును చూసుకునేందుకు ఆస్పత్రికి వెళ్లిన తల్లిదండ్రులకు వైరస్ సోకింది. కొడుకు డిశ్చార్జై హోం ఐసోలేషన్​లో ఉండగా తల్లిదండ్రులు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ మృతిచెందారు. వారి మరణవార్త విన్న కుమారుడు గుండెపోటుతో అక్కడికక్కడే మృతిచెందిన విషాద ఘటన మాసానిగూడలో చోటు చేసుకుంది.

parents-died-with-corona-and-son-died-with-heart-attack
కొవిడ్‌తో తల్లిదండ్రులు.. గుండెపోటుతో కుమారుడు

రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లి మండలంలోని మాసానిగూడకు చెందిన విశ్వనాథం(58) కాంచన్‌బాగ్‌ బీడీఎల్‌లో ఉద్యోగి కాగా.. కుమారుడు అరుణ్‌కుమార్‌(33) బ్యాంకు ఉద్యోగి. ప్రస్తుతం వీరు హైదరాబాద్‌లో ఉంటున్నారు. 15రోజుల క్రితం అరుణ్‌కుమార్‌కు పాజిటివ్‌ రాగా, ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొంది.. ఇంటికి చేరుకున్నాడు.

అరుణ్‌ కోసం ఆసుపత్రికి వచ్చి వెళ్లిన క్రమంలో తండ్రితో పాటు తల్లి రుక్మిణి(50)కి కరోనా సోకింది. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందారు. తల్లిదండ్రుల మరణవార్త తెలుసుకొని, ఆ బాధ తట్టుకోలేక ఇంట్లో ఉన్న అరుణ్‌కుమార్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయి గుండెపోటుతో మృతిచెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

ఇదీ చూడండి: ఒకరి తర్వాత ఒకరు... అయిదు రోజుల్లో ముగ్గురు మృతి

Last Updated : May 6, 2021, 10:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.