కాళేశ్వరం ప్రాజెక్టు మాదిరిగానే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టునూ మూడు సంవత్సరాల్లో పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్, శంకర్‌పల్లి మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మొయినాబాద్ మండలం తోల్కట్టలోని వ్యవసాయ క్షేత్రంలో స్వామి రామానంద తీర్థ విగ్రహావిష్కరణ చేశారు. శంకర్‌పల్లి మండలంలోని పర్వేద గ్రామంలో పాఠశాల అదనపు గదుల నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతాయని ఆమె కొనియాడారు.
ఇదీ చూడండి : ఎంఆర్ఓ ఆత్మహత్య... బదిలీలే కారణామా?