Statue Of Equality Visiting Times : శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు కన్నులపండువగా జరిగాయి. అంగరంగవైభంగా జరిగిన ఈ ఉత్సవాల్లో దే నలుమూలల నుంచి ప్రముఖులు వచ్చారు. ఈ వేడుకల్లో భాగంగా శ్రీరామనగరానికి సందర్శకులు 24/7 వచ్చేవారు. కానీ ఉత్సవాలు ముగియడంతో సందర్శకుల రాకకు నిర్వాహకులు ప్రణాళిక రూపొందించారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ శ్రీరామనగరంలోని సమతామూర్తి కేంద్రంలో ఇవాళ్టి నుంచి సందర్శనకు అనుమతిస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్ర 7 గంటల వరకు రోజుకు నాలుగు గంటల పాటు అనుమతి ఉంటుందని జీవాశ్రమం నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. సాధారణ ప్రవేశ రుసుముతో సమతామూర్తిని దర్శించుకోవచ్చని చెప్పారు. ఈ నెల 19న 108 దివ్య దేశ భగవన్మూర్తుల కల్యాణమహోత్సవ క్రతువు పూర్తయ్యే వరకు సువర్ణమూర్తి దర్శనం, త్రీడి షోలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వివరించారు.
- ఇదీ చదవండి : Medaram jathara 2022: నేటి నుంచే మేడారం మహాజాతర..