One Crore Saplings Plantation Today in Telangana : స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా ఇవాళ కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పల్లెలు, పట్టణాల్లో కోటి మొక్కలు నాటనున్నారు. రంగారెడ్డి జిల్లా చిల్కూరు ఫారెస్ట్ బ్లాక్‌లోని మంచిరేవుల వద్ద ఉన్న ఫారెస్ట్ ట్రెక్ పార్కులో ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్క నాటి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, అన్ని వర్గాల ప్రజలు కోటి వృక్షార్చనలో పాల్గొని మొక్కలు నాటాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
Swatantra Bharata Vajrotsavalu 2023 Closing Ceremony : రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫారెస్ట్ ట్రెక్ పార్కును సీఎం కేసీఆర్ నేడు ప్రారంభిస్తారు. రంగారెడ్డి జిల్లా చిల్కూర్ ఫారెస్ట్ బ్లాక్ పరిధిలోని మంచిరేవుల వద్ద 360 ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్కును అభివృద్ధి చేశారు. అర్బన్ లంగ్ స్పేస్‌లో భాగంగా మానసిక ఉల్లాసం, ఆహ్లాదకరమైన వాతావరణం అందించేలా సరికొత్త థీమ్‌తో అభివృద్ధి చేసిన ఈ పార్కు.. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గండిపేట, కోకాపేట, మంచిరేవుల పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులోకి రానుంది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగర ఆకాశ హర్మ్యాలను వీక్షించేలా ఏర్పాటు చేసిన వాచ్ టవర్ అదనపు ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు. పార్కులో గజీబో, వాకింగ్ ట్రాక్, ట్రెక్కింగ్, రాక్ పెయింటింగ్, తదితర సదుపాయాలు కల్పించారు.
జపాన్ సాంకేతికతతో ఆ గ్రామంలో 'మినీ ఫారెస్ట్' సృష్టి!
Swatantra Bharata Vajrotsavalu 2023 Telangana : స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా కోటి వృక్షార్చనను విజవయవంతం చేయాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. ఈ మేరకు ఉన్నతాధికారులు, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్కును ఆమె శుక్రవారం సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.
One Crore Saplings Plantation Today : చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో సరికొత్త థీమ్‌తో అభివృద్ధి చేసిన ఈ పార్క్ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గండిపేట, కోకాపేట పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగర ఆకాశ హర్మ్యాలను వీక్షించేలా ఏర్పాటు చేసిన వాచ్ టవర్ ఈ పార్కులో అదనపు ఆకర్షణగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు అధికారులతో కలిసి వ్యూ పాయింట్ నుంచి పార్క్ మొత్తాన్ని పరిశీలించారు. నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి చేసేలా చూడాలని అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.
ఎంపిక చేసిన ప్రాంతంలో గుంతలు తవ్వండి..: స్వతంత్ర వజ్రోత్సవ ముగింపు ఉత్సవాల ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇటీవల పరిశీలించారు. హరితహారంలో భాగంగా మంచిరేవుల ఫారెస్ట్ పార్కులో 2 వేల మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారని.. ఇందుకు సంబంధించి ఎంపిక చేసిన ప్రాంతంలో గుంతలు తవ్వాలని, తగిన ఏర్పాట్లు చేయాలని శాంతికుమారి అధికారులను ఆదేశించారు.