రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నేదునూరులో దారుణం చోటుచేసుకుంది. గ్రామశివారులో ఒంటరిగా నివసిస్తోన్న బాలమణి (80) అనే వృద్ధురాలిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు.
ఆమె ఒంటిపై ఉన్న 8 తులాల బంగారు ఆభరణాల్ని ఎత్తుకెళ్లారు. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలికి పోలీసులు చేరుకున్నారు. బాలమణి ఇళ్లు ఊరికి చివర ఉండటం, ఇంట్లో ఆమె ఒంటరిగా ఉంటుందని తెలిసిన వారే ఎవరైనా ఈ దారుణానికి ఒడిగట్టారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- ఇదీ చదవండి : భార్యపై ప్రేమతో అడవినే సృష్టించాడు