రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద కరోనా నిర్ధారణ పరీక్ష కోసం వచ్చిన వృద్ధురాలు మృతి చెందింది. నిర్దవెల్లి గ్రామానికి చెందిన 75 ఏళ్ల ఢిల్లీ కిష్టమ్మ ఐదు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతోంది. కరోనా అనుమానంతో కుటుంబసభ్యులు కేశంపేట ప్రభుత్వ ఆస్పత్రికి కొవిడ్ నిర్ధరణ పరీక్ష కోసం తీసుకువచ్చారు.
కొద్దిసేపటి తర్వాత కిష్టమ్మ కుప్పకూలింది. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అయితే నిర్ధరణ పరీక్షలో కిష్టమ్మకు కరోనా ఉన్నట్లు తేలిందని ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ శారద, మృతురాలి కుటుంబసభ్యులు తెలిపారు.
ఇవీ చదవండి: రాష్ట్రంలో కొనసాగుతున్న కొవిడ్ వ్యాక్సినేషన్