ETV Bharat / state

occupied: మళ్లీ అదే పని చేశాడు - rangareddy district news today

ఓ కబ్జాదారుడు ప్రభుత్వ భూమిపై కన్నేశాడు. అంతే అదును చూసి ఆక్రమించేశాడు(occupied). రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. విషయం తెలుసుకున్న ‘ఈనాడు’ ఆ అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. రంగంలోకి దిగిన అధికారులు ఆ భూమిని ప్రభుత్వ ల్యాండ్​గా గుర్తించి బోర్డులు పెట్టేశారు. కానీ తాజాగా మళ్లీ ఆ కబ్జాదారుడు ఆ భూమిని ఆక్రమించి నిర్మాణాలు ఏర్పాటు చేస్తున్నాడు. గమనించిన స్థానికులు అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Occupy same land again
occupied: మళ్లీ అదే భూమి ఆక్రమణ
author img

By

Published : Jun 27, 2021, 10:52 AM IST

అది రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమి. రెండేళ్ల కిందట ఓ కబ్జాదారుడు దాన్ని తనపరం చేసుకున్నాడు. ఈ విషయం పసిగట్టిన ‘ఈనాడు’ ఈ బాగోతాన్ని అప్పట్లో వెలుగులోకి తెచ్చింది. ఈ కథనంపై స్పందించిన రెవెన్యూ అధికారులు సదరు స్థలాన్ని స్వాధీనం చేసుకుని ‘ఇది సర్కార్‌ స్థలమంటూ’ బోర్డు పెట్టారు. రోజులు గడిచిపోయాయి.. కరోనా సమయంలో ఎవరూ పట్టించుకోకపోవడంతో బోర్డును పీకిపారేసి అదే భూమిని రెండోసారి తన అధీనంలోకి తెచ్చుకున్నాడు.

రాజేంద్రనగర్‌ డివిజన్‌ బుద్వేల్‌ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్‌ 89లో ఎకరా స్థలం ప్రభుత్వానికి చెందింది. ఖరీదైన ఈ స్థలంపై గతంలోనే కబ్జాదారుల కన్ను పడింది. స్థానిక నేతల సహకారంతో కబ్జాలకు ప్రణాళికలు రచించారు. రెవెన్యూ శాఖలోని కిందిస్థాయి ఉద్యోగులను మచ్చిక చేసుకుని ప్రభుత్వ భూమిని ప్రైవేటు భూమిగా రికార్డులు మార్చారు. ఎకరా భూమిని ఓ రియల్టర్‌ దర్జాగా కబ్జాకు పాల్పడ్డాడు.

ఈ మొత్తం బాగోతాన్ని 2019 మార్చి నెలలో ‘ఈనాడు’ వెలుగులోకి తెచ్చింది. అయితే తహసీల్దార్‌ చంద్రశేఖర్‌ వెంటనే రంగంలోకి దిగి సర్వే నెంబర్‌ 89లో ప్రభుత్వ స్థలం ఉందని రికార్డుల్లో గుర్తించారు. తరువాత అక్కడ మరోసారి సర్వే చేయించి నిర్ధరణకు వచ్చారు. కబ్జా స్థలాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ భూమి అంటూ బోర్డు పెట్టారు.

అయితే ఏడాది కాలంగా కరోనా నివారణ చర్యల్లో అధికారులు నిమగ్నం కాగా.. కబ్జాదారులు మాత్రం ఆక్రమణలపై దృష్టి సారించారు. ప్రభుత్వ స్థలమంటూ ఏర్పాటు చేసిన బోర్డును తొలగించి... మళ్లీ అక్కడ నిర్మాణాలకు పూనుకున్నారు. ఇటీవల తాజాగా అక్కడ ఓ గదితోపాటు ప్రవేశ ద్వారాన్ని నిర్మించారు. అధికారులు పట్టించుకోకపోతే ఆ స్థలం పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలోకి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే అక్కడ వెంచర్‌ చేసి విక్రయించడానికి ప్రణాళికలు చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

గతంలో ఏర్పాటు చేసిన బోర్డు

పార్కు స్థలానికి ఎసరు..

కబ్జాకు గురైనా స్థలానికి దగ్గరలోనే ఓ ప్రైవేటు సంస్థ వెంచర్‌ వేసి పార్కు కోసం 1200 గజాల స్థలాన్ని కేటాయించింది. నాలుగేళ్ల క్రితం రాజేంద్రనగర్‌ సర్కిల్‌ అధికారులు పార్కు స్థలాలను గుర్తించారు. దాన్ని రక్షించాలన్న ఉద్దేశంతో ప్రహరీ నిర్మించారు. ఈ పార్కు స్థలం కబ్జాకు గురైన ఎకరా స్థలానికి ఆనుకుని ఉంటుంది. కబ్జాదారులు పార్కు స్థలంతో సహా కలిపి కబ్జాకు పాల్పడుతున్నారు. గతంలో నిర్మించిన ప్రహరీని కూల్చివేశారు. పార్కు స్థలంతో కలిపితే దాని విలువ సుమారు రూ.15 కోట్ల వరకు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.

స్వాధీనం చేసుకుంటాం

"సర్వే నెంబర్‌ 89లో ప్రభుత్వ స్థలం ఉన్నమాట వాస్తవమే. గతంలో సర్వేయర్‌ చేసిన పొరపాటు కారణంగా స్థలంలో ప్రైవేటు వ్యక్తులు పాగా వేశారు. ప్రభుత్వం వేలం వేయడానికి అవకాశం ఉన్న భూముల వివరాలను పంపమనడంతో... ఈ స్థలం కూడా అందులో ప్రతిపాదించాం. కబ్జాకు గురైన స్థలాన్ని వెంటనే స్వాధీనం చేసుకొంటాం. అవసరమైతే కబ్జాదారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయిస్తాం."

- చంద్రశేఖర్‌, తహసీల్దార్‌

ఇదీ చూడండి: రేపు పీవీ విగ్రహాన్ని ఆవిష్కరించున్న సీఎం, గవర్నర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.