రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల కేంద్రంలోని ఆర్బీ నగర్లో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లోని ఫ్యానుకు ఉరివేసుకుని ఓ నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఖమ్మం జిల్లాకు చెందిన రాజేశ్వరికి అనంతపురం జిల్లాకు చెందిన తిలక్‌తో ఇటీవల వివాహం జరిగింది. 2 నెలల క్రితం పట్టణానికి వచ్చి... శంషాబాద్ ఆర్బీనగర్లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు.
ఇల్లు ఖాళీ చేస్తామని చెప్పడంతో యజమాని కృష్ణ ఉదయం ఇంటికి వెళ్లాడు. తలుపు తీయకపోవడం వల్ల కిటికీలోంచి చూడగా రాజేశ్వరి ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భర్త తిలక్ పరారీలో ఉన్నట్లు తెెలిపారు.
ఇవీ చూడండి: సాయం చేయండి.. పసివాడికి ప్రాణం పోయండి