రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కమిషనర్ సురేందర్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. మున్సిపాలిటీలోని 22వ వార్డులోని ఇందిరమ్మ కాలనీలో ఆయన పర్యటించారు.
కార్యక్రమంలో భాగంగా జేసీబీల సహాయంతో చెత్తాచెదారాన్ని తొలగించారు. అనంతరం తడి చెత్త, పొడి చెత్త, పరిసరాల పరిశుభ్రతపై కాలనీవాసులకు అవగాహన కల్పించారు. పట్టణాల్లో సమస్యల పరిష్కారం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు.
ఇవీచూడండి: అట్టుడికిన దిల్లీ.. పౌర హింసలో ఐదుగురు మృతి