రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీలోని ఉస్మాన్‌నగర్ ప్రాంతంలో 2 నెలల నుంచి ఇంకా వరద నీటిలోనే ఉన్న 150 ఇళ్ల బాధితులకు శాశ్వత పరిష్కారం కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ డా. జీపీ కుమార్ తెలిపారు. 4,5 రోజుల్లో సమస్య పూర్తి పరిష్కారం అవుతుందని చెప్పారు. రాత్రిళ్లు బుర్హాన్ ఖాన్ చెరువు కట్ట వద్ద పనులను సిబ్బందితో కలిసి కమిషనర్ పరిశీలిస్తున్నారు. విద్యాశాఖ మంత్రి ఆదేశాలు, కలెక్టర్ పర్యవేక్షణతో ఇప్పటివరకు 316 ఇళ్ల బాధితుల సమస్య పరిష్కారం అయిందని వివరించారు.
రూ. 50లక్షలతో ట్రంక్ లైన్ పనులు చేపట్టామని.. నీటిని చెరువు నుంచి బయటకు వదులుతున్నామని కమిషనర్ అన్నారు. వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపిన ఆయన.. ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేస్తున్నామని పేర్కొన్నారు. అంటు వ్యాధులు ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని కమిషనర్ తెలిపారు.
ఇదీ చదవండి: మేయర్ పీఠం దక్కకున్నా.. అభివృద్ధికి కృషి చేస్తాం: బండి