Mudha Pawan has been appointed as the president of BRS youth wing: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షులుగా ముద్ద పవన్‌ను నియమిస్తూ ఆ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. అంతకు ముందు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, పార్టీ అభిమానులతో బైక్‌లపై మంత్రి క్యాంప్ కార్యాలయానికి ర్యాలీగా వచ్చిన పవన్.. మంత్రి సబితాకు గజమాలతో సత్కరించారు.
అనంతరం మాట్లాడిన ఆయన.. నియోజకవర్గంలోని యువతను ఒకే తాటిపై తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలు, కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులను గ్రామస్థాయి వరకు తీసుకెళ్తాని పేర్కొన్నారు. పార్టీ విధివిధానాలను అనుసరిస్తూ ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు వెళ్తానని పవన్.. సబితా ఇంద్రారెడ్డికి మాట ఇచ్చారు. అనంతరం తనపై నమ్మకంతో యువజన విభాగం అధ్యక్షులుగా బాధ్యత అప్పజెప్పడంపై మంత్రి సబితకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఇవీ చదవండి: