ETV Bharat / state

వైరల్​గా మారిన ఎమ్మెల్యే ఫోన్​ సంభాషణ

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద​ వీఆర్​వోతో మాట్లాడిన ఫోన్​ సంభాషణ వైరల్​గా మారింది. విద్యుత్​ మీటర్లు ఎందుకు తీసుకెళ్లారంటూ వీఆర్​వో శ్యామ్​పై తిట్లతో విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే.

mla vivekanda phone call audio viral
వైరల్​గా మారిన ఎమ్మెల్యే ఫోన్​ సంభాషణ
author img

By

Published : Oct 5, 2020, 4:09 AM IST

గాజులరామారం పరిధిలోని పెద్దమ్మనగర్​లోని సర్వే నెంబర్ 79లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన అధికారులు విద్యుత్​ మీటర్లు తీసుకెళ్లారు. దీంతో ఆ ప్రాంతంలో నివాసం ఉండే సుమారు 200 మంది కుటుంబాలు తమ ఇళ్లను వీఆర్​వో కూల్చేశారంటూ చింతల్​లోని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద కార్యాలయానికి వచ్చారు. న్యాయం చేయాలని కోరారు.

శనివారం తెల్లవారుజామున 12 ఇళ్లను కూల్చి వారి ఇంటి కరెంటు మీటర్లు తీసుకెళ్లినట్లు బాధితులు ఎమ్మెల్యేకు వివరించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వివేకానంద వీఆర్​వో శ్యామ్​తో ఫోన్లో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిట్లతో విరుచుకుపడ్డారు. వీఆర్​వోతో ఎమ్మెల్యే మాట్లాడిన ఆడియో ఇప్పుడు వైరల్​గా మారింది. వీఆర్​వో శ్యామ్​పై ఆగ్రహం వ్యక్తం చేసిన మాట వాస్తవమేనని.. మహిళలు తమ గోడును తెలిపిన విధానంతో చలించి వివేకానంద ఆగ్రహించారని ఎమ్మెల్యే కార్యాలయం వివరణ ఇచ్చింది.

వైరల్​గా మారిన ఎమ్మెల్యే ఫోన్​ సంభాషణ

ఇదీ చదవండి: శ్రీశైలం ఘంటామఠంలో బయటపడ్డ బంగారు నాణేలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.