రంగారెడ్డి జిల్లా మున్సురాబాద్ పట్టణ ఆరోగ్య కేంద్రం వద్ద.. మంగళవారం తలెత్తిన గందరగోళ పరిస్థితిపై ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఆరా తీశారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చిన ఎమ్మెల్యే.. వ్యాక్సిన్, కరోనా పరీక్షల కోసం వచ్చిన వారితో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రం సిబ్బందికి పలు సూచనలు చేశారు.
వ్యాక్సినేషన్, కరోనా నిర్ధరణ పరీక్షలను వేర్వేరు ప్రాంతాల్లో చేపట్టాలని సిబ్బందికి సూచించారు. సంబంధిత అధికారులతో మాట్లాడారు. రేపటి నుంచే అమలయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. ఆరోగ్య కేంద్రం వద్ద గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యాక్సినేషన్లో ఎవరూ ఇబ్బంది పడకూడదని ఎమ్మెల్యే అన్నారు. ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటుచేసి ఆన్లైన్, ఆఫ్‌లైన్ పద్ధతుల్లో వ్యాక్సినేషన్ చేయాలన్నారు.
కరోనా పరీక్షల కోసం రోజు వందల మంది ఆస్పత్రుల వద్ద క్యూ కడుతున్నారని.. ఫలితంగా కరోనా లక్షణాలతో బాధపడుతున్నవారికి పరీక్షలు నిర్వహించడంలో కష్టమవుతుందని ఎమ్మెల్యే అన్నారు. కొవిడ్ లక్షణాలు ఉంటేనే పరీక్షల కోసం రావాలని ప్రజలకు సూచించారు.
ఇవీచూడండి: ఆస్పత్రి సిబ్బంది స్థానికుల మధ్య గందరగోళం