అకాల వర్షం కారణంగా నష్టపోయిన ప్రతిరైతును ఆదుకుంటామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో నియోజకవర్గంలో వడగండ్ల వాన కురవగా.. దానివల్ల దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే పరిశీలించారు.
రైతులతో నేరుగా మాట్లాడి పంటనష్టం గురించి అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతుల పూర్తి వివరాలు సేకరించాలని అధికారులను కిషన్‌రెడ్డి ఆదేశించారు.
ఇదీ చూడండి: తెలంగాణలో 471కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు