రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మునగనూరు జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషిచేస్తానని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. కాలనీలో మిషన్ భగీరథ నీటి సదుపాయాన్ని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ప్రారంభించారు.
మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు మంచినీరు అందివ్వాలన్న ఉద్దేశంతో రూ.92 కోట్లు కేటాయించామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తెలిపారు. కాలనీలో నెలకొన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, రైతుబంధు జిల్లా చైర్మన్ వంగేటి లక్ష్మారెడ్డి, కౌన్సిలర్ వేముల స్వాతి అమరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Rajnath singh: ఆ పేరు చెబితే శత్రువు గుండెల్లో గుబులు ఖాయం: రాజ్‌నాథ్