ETV Bharat / state

రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి: ఎమ్మెల్యే కిషన్ రెడ్డి

author img

By

Published : Nov 13, 2020, 11:55 AM IST

Updated : Nov 13, 2020, 12:28 PM IST

రైతుల సంక్షేమం కోసం గతంలోని ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ సర్కార్ కృషి చేస్తోందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని సంఘీనగర్​లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

mla manchireddy kishan reddy
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం నిరంతరం రైతుల అభివృద్ధికి కృషి చేస్తోందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. పంటకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని సంఘీనగర్​లో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

పత్తి రకాలను బట్టి కనీస మద్దతు ధరను ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రైతులంతా పత్తి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార సంఘం బ్యాంక్ వైస్ ఛైర్మన్ కొత్త కురుమ సత్తయ్య, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, స్థానికులు, రైతులు పాల్గొన్నారు.

రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి: ఎమ్మెల్యే కిషన్ రెడ్డి

ఇదీ చూడండి : ప్రేమికుడే హంతకుడా... అత్యాచారం జరిగిందా?

Last Updated : Nov 13, 2020, 12:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.