దళారులను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే కిషన్రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే పంటను విక్రయించుకోవాలని సూచించారు. ఇబ్రహీంపట్నంలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీసీఎంఎస్ జిల్లా ఛైర్మన్ కృష్ణారెడ్డితో కలిసి ప్రారంభించారు.
దేశంలోనే ఎక్కడాలేని విధంగా తెలంగాణలో... రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పత్తి, ధాన్యం కొనుగోలు కేంద్రాల వల్ల... రైతులు తాము పండించిన పంటకు మద్దతు ధరను పొందుతున్నారన్నారు.
ఇదీ చూడండి: మిర్యాలగూడలో బారులు తీరిన సన్నరకం ధాన్యం ట్రాక్టర్లు