ETV Bharat / state

'సమష్టి కృషితో ముందుకెళదాం.. తెలంగాణను హరిత శోభితం చేద్దాం' - Ministers at Haritha Haram Latest News

తెలంగాణను హరిత శోభితం చేయడానికి ప్రతిఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్​ యాదవ్ తెలిపారు. మహేశ్వరం మండలంలోని షీప్ బ్రీడింగ్ ఫామ్​లో మొక్కలు నాటారు.

షీప్ బ్రీడింగ్​ ఫామ్​లో మొక్కలు నాటిన మంత్రులు తలసాని, సబితా

author img

By

Published : Jul 7, 2020, 3:23 PM IST

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మామిడిపల్లిలోని షీప్ బ్రీడింగ్ ఫామ్​లో హరితహారం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి మొక్కలు నాటారు.

విజయవంతం చేయాలి : తలసాని

ఆరో విడత హరితహారం విజయవంతం చేయాలని మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రి ప్రజలను కోరారు. రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు సీఎం కేసీఆర్ హరిత యజ్ఞానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.

నాటడమే కాదు సంరక్షణా చేపట్టాలి: సబితా

రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిందని విద్యాశాఖ మంత్రి సబితా అన్నారు. పంచాయతీరాజ్, పురపాలక చట్టాలతో పచ్చదనం పెంపునకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించాలని ఆమె సూచించారు.

షీప్ బ్రీడింగ్​ ఫామ్​లో మొక్కలు నాటిన మంత్రులు తలసాని, సబితా

ఇవీ చూడండి : 'ఇది చాలా హేయమైన చర్య... సీఎం ఎక్కడున్నారు?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.