ETV Bharat / state

ఏరువాక పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న మంత్రులు

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం జాలగూడ గ్రామంలోని గంగోత్రి గోశాలలో నిర్వహించిన ఏరువాక పౌర్ణమి వేడుకల్లో మంత్రులు నిరంజన్​రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. పలువురు రైతులను మంత్రులు సన్మానించారు. నియంత్రిత వ్యవసాయ విధానంతో అన్నదాతలకు లాభం చేకూరుతుందని మంత్రి నిరంజన్​రెడ్డి అన్నారు.

ministers participated in eruvaka pournami celebrations in rangareddy district
ఏరువాక పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న మంత్రులు
author img

By

Published : Jun 6, 2020, 8:22 PM IST

నియంత్రిత వ్యవసాయం విధానంతో రైతులకు లాభం చేకూరుతుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం జాలగూడ గ్రామంలోని గంగోత్రి గోశాలలో జరిగిన ఏరువాక పౌర్ణమి వేడుకల్లో మంత్రులు నిరంజన్​రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి పాల్గొని రైతులను సన్మానించారు. గోశాల నిర్వాహకుడు హనుమంతరావు, ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా పరిషత్ ఛైర్​పర్సన్​ అనితారెడ్డి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. వందల ఆవులను పెంచుతున్న హనుమంతరావును మంత్రులు అభినందించారు. ఆధునిక పోకడలతో పశువులు అంతరించిపోయాయని మంత్రి నిరంజన్​రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

సాగులో రసాయనిక ఎరువులు వాడటం వల్ల మానవ జీవనం వ్యాధులతో కొట్టుమిట్టాడుతోందని అన్నారు. సేంద్రియ వ్యవసాయంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని మంత్రి తెలిపారు. ప్రతి ఇంట్లో పశువులు ఉన్నప్పుడు ఆ వ్యక్తులు చెడు దారిలో కాకుండా మంచి దారిలో నడుచుకునే వారని గుర్తు చేశారు. వాటి పోషణ కోసం సమయం వృథా చేయకుండా ఇంటికి వచ్చేవారని పేర్కొన్నారు . ఈ గోశాలలో విద్యాలయం ఏర్పాటు చేసి సేంద్రియ సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆవుల పెంపకం ద్వారా ఆ కుటుంబానికి ఆర్థిక భద్రతతో పాటు మానవ జీవనంలో మార్పులు వస్తాయని మంత్రి వెల్లడించారు.

ఇవీ చూడండి: అత్యవసర సేవకులకు ఇబ్బంది రానివ్వం: ఈటల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.