జాతీయ బాలల దినోత్సవం పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా సైదాబాద్‌లోని ప్రభుత్వ బాలుర హోమ్‌లో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి సత్యవతి రాఠోడ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు.
మంచి మార్గంలో
చిన్నతనంలో అందరూ తెలిసీ తెలియక తప్పులు చేయటం సహజమని, వాటిని సరిదిద్దుకుని మంచి మార్గంలో నడవాలని బాలలకు సత్యవతి సూచించారు. అలాంటి వారే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని అన్నారు. అనాథ విద్యార్థులకు, వసతి గృహాల్లో ఉంటున్న వారికి అన్ని రకాలుగా అందుబాటులో ఉంటామని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో సెక్రటరీ, శ్రీ శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య, హోమ్ డైరెక్టర్ శైలజ, స్థానిక కార్పొరేటర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: మియాపూర్ రిలయన్స్ డిజిటల్లో భారీ చోరీ.. షోరూం మూసివేత