మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ నగర్ గ్రామంలో యువతిని అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన అత్యంత బాధాకరమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాజేంద్ర నగర్‌లోని బుద్వేల్‌లో బాధిత యువతి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌తో కలిసి పరామర్శించారు.
నిందితులకు కఠిన శిక్ష పడేంత వరకు వదిలిపెట్టమని.. కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ చేయిస్తామని తెలిపారు. బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించనున్నట్టు మంత్రి హామీ ఇచ్చారు. మృతురాలి సోదరిని అడిగి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు ఇప్పటికే నిందితునిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారని.. బాధితులకు న్యాయం చేస్తామని మంత్రి తెలిపారు. బాధితురాలి చెల్లెకు రెసిడెన్షియల్ పాఠశాలలో ఉచిత విద్య అందించనున్నట్టు తెలిపారు.
ఇవీ చూడండి: 'అభ్యర్థి ఎవరనేది అధిష్ఠానమే చెబుతుంది'