ETV Bharat / state

Sabitha Indrareddy: శుభకార్యాల సమయంలో వాటిని బహుమతిగా ఇవ్వండి: సబిత

Sabitha Indrareddy: ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగులకు గ్రంథాలయము చాలా ఉపయోగపడుతుందని విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా బడంగ్​పేట్​లో జిల్లా కేంద్ర గ్రంథాలయ నూతన భవనాన్ని ఆమె ప్రారంభించారు.

Sabitha Indrareddy
సబితా
author img

By

Published : Jun 15, 2022, 8:44 PM IST

Sabitha Indrareddy: శుభకార్యాల సమయంలో కుటుంబ సభ్యులు గ్రంథాలయాలకు పుస్తకాలను బహుమతిగా ఇవ్వాలని విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి కోరారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్​పేట్​ పరిధిలో రూ.4.36 కోట్లతో నిర్మించిన జిల్లా కేంద్ర గ్రంథాలయ నూతన భవనాన్ని రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ శ్రీధర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడిన నేపథ్యంలో గ్రంథాలయము నిరుద్యోగులకు ఉపయోగపడుతుందని మంత్రి అన్నారు.

పోటీపరీక్షలకు పుస్తకాల కొరత లేకుండా చూస్తామని మంత్రి తెలిపారు. ఇప్పటికే పది లక్షల రూపాయలతో పుస్తకాలను కొనుగోలు చేయడం జరిగిందని మంత్రి అన్నారు. దాతలు గ్రంథాలయాలకు సహకరించాలని తెలంగాణ గ్రంథాలయ చైర్మన్ శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు బోగ్గరపు దయానంద్, వాణి దేవి, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ కాప్పటి పాండురంగా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, బడంగ్​పేట్ కార్పొరేషన్ మేయర్ పారిజాత రెడ్డి, కార్పొరేటర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

TSTET Key Released: టెట్ ప్రాథమిక కీ విడుదల

రాష్ట్రపతి ఎన్నికపై విపక్ష నేతలతో రాజ్​నాథ్​ చర్చ.. ఏకగ్రీవానికి పావులు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.