ETV Bharat / state

Minister Sabitha Indrareddy: ''మన ఊరు-మన బడి' కార్యక్రమంతో బడులకు మహర్దశ' - ts news

Minister Sabitha Indrareddy: 'మన ఊరు-మన బడి' కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన పాఠశాలల రూపురేఖలు మార్చే విధంగా త్వరితగతిన పనులు ప్రారంభించాలని అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఈ కార్యక్రమంతో బడులకు మహర్దశ రానుందని ఆమె వెల్లడించారు.

''మన ఊరు-మన బడి' కార్యక్రమంతో బడులకు మహర్దశ'

author img

By

Published : May 18, 2022, 12:35 AM IST

''మన ఊరు-మన బడి' కార్యక్రమంతో బడులకు మహర్దశ'

Minister Sabitha Indrareddy: మన ఊరు-మన బడి కార్యక్రమంతో మహేశ్వరం నియోజకవర్గ బడులకు మహర్దశ రానుందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మన ఊరు - మన బడి, మన బస్తీ - మన బడి కార్యక్రమంలో భాగంగా మహేశ్వరం నియోజవర్గ పరిధిలోని మీర్​పేట్ మున్సిపల్​ కార్పొరేషన్ కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ పథకంలో భాగంగా నియోజకవర్గంలో ఎంపిక చేసిన పాఠశాలల్లో చేపట్టాల్సిన పనులతో ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.7289 కోట్లతో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి సంబంధించి మొదటి విడతలో రూ.3497 కోట్లతో 9123 పాఠశాలల్లో 12 రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహేశ్వరం నియోజకవర్గంలో ఎంపిక చేసిన పాఠశాలల రూపురేఖలు మార్చే విధంగా త్వరితగతిన పనులు ప్రారంభించాలని ఇంజనీరింగ్ అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, పార్టీ ఫ్లోర్ లీడర్ భూపాల్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.