ETV Bharat / state

అర్థం కాకపోతే ఉపాధ్యాయులను అడగండి : సబిత - rangareddy news

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ ప్రాథమిక పాఠశాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆన్​లైన్ తరగతులు​ జరుగుతున్న తీరుపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

minister sabitha indrareddy inspection primary school in thukkuguda in rangareddy dist
పాఠాలు అర్థం కాకపోతే ఉపాధ్యాయులను అడగండి : సబితా
author img

By

Published : Dec 29, 2020, 7:26 PM IST

ఆన్​లైన్​ తరగతుల పాఠాలు అర్థం కాకపోతే ఉపాధ్యాయులను అడిగి సందేహాలు నివృత్తి చేసుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్థులకు సూచించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ ప్రాథమిక పాఠశాలను ఆకస్మాత్తుగా తనిఖీ చేశారు. ఆన్​లైన్​ తరగతులు జరుగుతున్న తీరుపై ఆరా తీశారు.

జాగ్రత్తలు తీసుకుంటూనే విద్యార్థులు చదువుపై పూర్తి దృష్టి సారించాలని తెలిపారు. కరోనా పరిస్థితుల వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సమస్యలు ఉంటే ప్రజాప్రతినిధులు, అధికారులు తోడ్పాటును అందిచాలని మంత్రి కోరారు.

ఇదీ చూడండి: మంత్రి కేటీఆర్​ను కలిసిన రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్​పర్సన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.