రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీలోని ఉస్మాన్ నగర్ ప్రాంతంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. మున్సిపల్ ఛైర్మన్ అహ్మద్ సాదితో కలిసి ఉస్మాన్‌నగర్‌ను పరిశీలించారు. బర్హాన్‌ఖాన్ చెరువు నుంచి వరద నీరు రాకుండా కట్టా ఎత్తు పెంచి... గతంలోనే మరమ్మతులు చేశామని మంత్రి తెలిపారు. అందుకే ఈసారి వరద నీరు రాలేదని వెల్లడించారు.
మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిని తెలుసుకునేందుకు వచ్చినట్లు స్పష్టం చేశారు. రెండు వీధుల్లో కొంత మేర వరద నీరు ఉందని.. కొన్ని ప్రాంతాల్లో మట్టిరోడ్లు బురదమయం అయ్యాయని... అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని ఆదేశించారు.
ఇదీ చూడండి: mla sudheer reddy: వరదలో చిక్కుకున్న ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కారు