నిబంధనలు ఉల్లఘించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపల్ కార్యాలయంలో వైద్య, పోలీస్ అధికారులతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యాధి ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పేదవారికి ఇబ్బందులు కలగకుండా చేపట్టాల్సిన పనులు, పేదల అవసరాలు తదితర అంశాలపై చర్చించారు.
రెడ్క్లస్టర్లలో ఉన్న ప్రాంత ప్రజలందరూ ఇళ్లను వదిలి బయటికి రావద్దని సూచించారు. నిత్యావసర సరుకులు అధికారులే ఇంటికి చేరుస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా మాస్కులు తప్పని సరిగా ధరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.