రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకరవర్గం పరిధిలోని ఎర్రకుంట ఎన్జే గార్డెన్లో మారి సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరై... నిరుపేదలకు నిత్యావసర సరకులను అందజేశారు.
కరోనా విపత్కర సమయంలో ఉపాధి కోల్పోయిన నిరుపేదలకు ఒక నెలకు సరిపడ నిత్యావసరాలను అందించిన మారి సంస్థ ప్రతినిధులను మంత్రి అభినందించారు. అలాగే ఆ సంస్థ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మారి సంస్థ ప్రతినిధులతోపాటు పలువురు స్థానిక తెరాస నేతలు పాల్గొన్నారు.