రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీ పహాడి షరీఫ్ గ్రామంలోని వాక్సినేషన్ కేంద్రాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. స్థానికంగా ఓ ఫంక్షన్ హాల్లోని టీకా పంపిణీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. టీకాపై అవగాహన కల్పించారు. కరోనా రోగుల కోసం ఏర్పాటు చేసిన వార్డును పరిశీలించారు. ఇప్పటి వరకు 87 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారని తెలిపారు.
కొవిడ్ చికిత్స పట్ల మున్సిపల్ కమిషనర్ జీపీ కుమార్, ఛైర్మన్ అబ్దుల్లాహ్ బిన్ అహ్మద్ సాది చొరవని మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్లాహ్ బిన్ అహ్మద్ సాది, మున్సిపల్ కమిషనర్ జిపి కుమార్, కౌన్సిలర్లు, నేతలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఆడుకుంటూ వెళ్లి నాలాలో పడ్డాడు.. అంతలోనే..!