రైతులకు మంచి సేవలు అందించి... కమిటీకి పేరు తీసుకురావాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. మార్కెట్ కమిటీ నూతన ఛైర్మన్ బుచ్చిరెడ్డి, వైస్ ఛైర్మన్ శ్రీధర్, పాలక మండలికి శుభాకాంక్షలు తెలియజేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని శంకరపల్లి నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి అన్నారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రంలోని రైతులు సంతోషంగా ఉంటున్నారని చెప్పారు. పెద్ద రైతు కేసీఆర్ తమకు అండగా ఉన్నారన్న భరోసాతో అన్నదాతలు ఆనందంగా ఉన్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డితో పాటు జిల్లా జడ్పీ ఛైర్మన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'దుబ్బాకలో పెద్దఎత్తున డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారు'