రంగారెడ్డి జిల్లా నూతనకల్ గ్రామానికి చెందిన కురుమస్వామి, భార్య సరిత, కుమారుడు సాయిచరణ్.. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ నేపథ్యంలో వారికున్న ఇద్దరు కుమార్తెలు.. పదో తరగతి చదువుతున్న శ్రీలేఖ, ఏడో తరగతి చదువుతున్న రుచిత అనాథలుగా మిగిలిపోయారు. వీళ్లకి ఉన్న నాయినమ్మకు పక్షవాతం రాగా.. కురుమస్వామికి ఉన్న భూమి కాగితాలు పెట్టి రుణం తీసుకున్నారు. ఈ సమయంలో ఇద్దరు పిల్లలు బతకడమే కష్టంగా మారగా.. వారికి ఈ అప్పు ఓ గుదిబండగా మారింది.
శ్రీలేఖ, రుచిత విషయం తెలుసుకున్న పీఏసీఎస్ ఛైర్మన్ సురేష్‌రెడ్డి.. వీరి గురించి మంత్రి మల్లారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన మంత్రి వారు అప్పు మొత్తాన్ని చెల్లించి.. బాధిత రైతు కుటుంబాన్ని ఇంటికి వెళ్లారు. వారికి పాస్‌బుక్‌లు, డాక్యుమెంట్లను మంత్రి అందజేశారు. భవిష్యత్తుతో వారికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటానని మంత్రి మల్లారెడ్డి హామీ ఇచ్చారు.
ఇదీ చదవండిః రాష్ట్రంలో రైతు వేదికలే దేవాలయాలు: మంత్రి మల్లారెడ్డి