ETV Bharat / state

Sparsh Hospice: ఆఖరి ఘడియల్లో ఆత్మీయ హస్తం... నేడే ప్రారంభం - minister ktr will launch sparsh-hospice hospital on tomorrow in Khajaguda

ఏ చిన్న జ్వరమో వచ్చినా.. దెబ్బ తగిలినా ఇంట్లోవాళ్లు సాకుతారు బిడ్డా.. మరి వచ్చింది పెద్ద జబ్బు.. అక్కడే ఉండి వాళ్లను ఇబ్బంది పెట్టడం ఇష్టంలేదు. నాలుగైదు రోజులు ఉండేదానికోసం వాళ్లను బాధపెడుతున్నానేమో అనిపిస్తుంది.. అయితే వారం రోజుల క్రితం ఇక్కడికి వచ్చా. వీళ్లు సొంత మనిషిలా ఆదరిస్తున్నారు. కూతురులాంటి అమ్మాయి తల దువ్వుతుంది. కొడుకులాంటి డాక్టర్‌ ఆకలి తీర్చుతున్నారు. ఉన్నంతకాలం ఇలా నవ్వుతూ ఉండాలి.. అలాగే వెళ్లిపోవాలి’ అని స్పర్శ్‌ హాస్పిస్‌లో తన అనుభవాన్ని వివరిస్తున్నారు క్యాన్సర్‌తో మృత్యు ముంగిట పోరాడుతున్న ఓ మహిళ.

sparsh-hospice
ఆఖరి ఘడియల్లో ఆత్మీయ హస్తం... ఈ స్పర్శ్‌ హాస్పిస్‌
author img

By

Published : Sep 3, 2021, 6:48 AM IST

Updated : Sep 4, 2021, 9:19 AM IST

పలకరింపులకు దూరంగా అయిన వారికి భారంగా అంతిమ ఘడియల్లో ఉన్న రోగులకు ఆత్మీయ నేస్తంగా ఉచితసేవలు అందిస్తోంది 'స్పర్శ్‌ హాస్పిస్‌'. రోటరీ క్లబ్‌ బంజారాహిల్స్‌ సారథ్యంలో అక్కడి రోడ్‌ నం.12లోని అద్దెభవనంలో సేవలు ప్రారంభించారు. ప్రస్తుతం నానక్‌రామ్‌గూడ మార్గంలోని ఖాజాగూడ శ్రీనిధి ఇంటర్నేషనల్‌ స్కూల్‌ పక్కన కొత్తగా నిర్మించిన భవనానికి మార్చారు. నేడు ఈ భవనాన్ని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అధికారికంగా ప్రారంభించనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, ఛŸత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా రోగులు ఇక్కడికి వస్తున్నారు. మనిషి పుట్టుక నుంచి పెరిగేంత వరకూ ఎంత గొప్పగా జీవించాడో.. మరణానికి కూడా అంతే గౌరవాన్ని అందించాలనే సంకల్పంతో సేవలు అందిస్తున్నామని స్పర్శ్‌ హాస్పిస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ రామ్‌మోహన్‌రావు ఎర్రపోతు తెలిపారు.

82 పడకలు.. 4 వాహనాలు

కార్పొరేట్‌ సంస్థలో పనిచేసే రామ్‌మోహన్‌రావు 2011లో రోటరీ బంజారాహిల్స్‌ శాఖ ప్రారంభించారు. 2017లో స్పర్శ్‌ హాస్పిస్‌ సేవలు మొదలుపెట్టారు. ఇండో-అమెరికన్‌ క్యాన్సర్‌ ఆసుపత్రితో కలసి 12 పడకలతో మొదలై 3,900 మందికి స్పర్శ్‌ సాంత్వన ఇచ్చింది. పాలికేర్‌లో ప్రత్యేకంగా శిక్షణ పొందిన వైద్యసిబ్బంది, స్వచ్ఛంద కార్యకర్తలు ఆఖరి ఘడియల్లో ఉన్న రోగులకు ఇంటివద్దనే (హోమ్‌కేర్‌) సేవలు అందిస్తున్నారు. సేవలు మరింత మందికి చేరువ చేయాలనే లక్ష్యంతో సొంత భవనం నిర్మించేందుకు సంస్థ సిద్ధమైంది. 2017లో అనువైన స్థలం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లడంతో ఖాజాగూడ వద్ద ఎకరా స్థలం కేటాయించారు. మంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపడం వల్లనే భవన నిర్మాణం సాకారమైందని రామ్‌మోహన్‌రావు తెలిపారు. అధునాతన భవనంలో పూర్తి వసతులతో 82 పడకలు ఏర్పాటు చేశారు. చిన్నారుల కోసం 10 కేటాయించారు. డాక్టర్లు ఆంజనేయులు, వనజ, కమలాకర్‌ , 30 మందికి పైగా నర్సింగ్‌ సిబ్బంది సేవలు అందిస్తున్నారు.

.

బాధను తగ్గించి.. మనసును తేలికపరిచి

ఆసుపత్రిలో బతుకు పోరాటం చేసి ఆఖరిదశకు చేరిన రోగులకు ఇక్కడ సేవలు అందిస్తారు. ఇంట్లో ఉంచి సేవలు చేసేందుకు అనువుగా లేని పేద, మధ్యతరగతి కుటుంబాలకూ సాంత్వన చేకూరుతోంది. చివరి క్షణంలో అనుభవించే మనోవేదన నుంచి బయట పడేయటం, మనసును తేలికపరచటమే తమ లక్ష్యమంటున్నారు డాక్టర్‌ ఆంజనేయులు. ఆ సమయంలో పిల్లల చదువులు, పెళ్లిళ్లు ఇవన్నీ గుర్తుకొస్తాయి. సమస్యలు చిన్నవైతే దాతల సాయంతో పరిష్కరిస్తున్నట్లు ఆయన చెప్పారు. క్షణాలు లెక్కబెడుతూ ఉన్న వారు ఎంతో మాట్లాడాలని ప్రయత్నిస్తారు. ఇప్పుడు వినకపోతే రేపు ఆ గొంతు వినపడదు. అందుకే.. ఓపికగా వింటామని డాక్టర్‌ వివరించారు.

ఉన్నత లక్ష్యానికి అందరి సహకారం

రామ్‌మోహన్‌రావు, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, స్పర్శ్‌ హాస్పిస్‌

దాతలు అందిస్తున్న ప్రోత్సాహంతో వేలాది మందికి ఉచితంగా సేవ చేయగలుగుతున్నాం. ఎస్బీఐ కార్డ్‌ ఆర్థికంగా సహకరిస్తుంది. కొవిడ్‌ వల్ల భవన ప్రారంభం ఆలస్యమైంది. సెప్టెంబరు 4న లాంఛనంగా ఆరంభించబోతున్నాం.. మరింత మంది దాతలు ముందుకొచ్చి సహకరిస్తే విస్తరిస్తాం. పాలికేర్‌లో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. ఆఖరి ఘడియల్లో ఉన్నవారికి అందించే సేవలు ప్రత్యేకంగా ఉంటాయి. ఆరోగ్య కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలకు శిక్షణ ఇవ్వటం ద్వారా మరింత మందికి దగ్గర కావచ్చు. పూర్తి వివరాలు ‌www. sparshhospice.org లో ఉన్నాయి. లేదా 9963504253, 9052893630కు ఫోన్‌ చేయవచ్చు. - రామ్‌మోహన్‌రావు, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, స్పర్శ్‌ హాస్పిస్‌.

ఇదీ చదవండి: KTR: ఐటీఐఆర్​ పథకాన్ని పునరుద్ధరించండి.. కేంద్రమంత్రికి కేటీఆర్​ విజ్ఞప్తి

Last Updated : Sep 4, 2021, 9:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.