సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ అన్ని రంగాల అభివృద్ధిలో దూసుకుపోతోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఎంపీ రంజిత్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ అనితా రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్యలతో కలసి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో పాల్టివ్ కేర్ సెంటర్, గిఫ్ట్ ఏ స్మైల్ కింద చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి సొంత నిధులతో ఏర్పాటు చేసిన అంబులెన్స్‌ను ప్రారంభించారు. పాల్టివ్ కేర్ సెంటర్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు.
వైద్యారోగ్య శాఖపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని ఈటల పేర్కొన్నారు. ప్రైవేటు ఆస్పత్రులు వైద్యం పేరిట రూ.లక్షలు వసూలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మీ, జడ్పీటీసీ మర్పల్లి మాలతి, సర్పంచ్ శైలజా ఆగిరెడ్డి, వైద్యాధికారులు, తెరాస నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కరోనా వ్యాప్తిపై కేంద్ర హోంశాఖ కీలక సమీక్ష